![]() |
![]() |

గత కొన్ని రోజులుగా కామనర్స్ ని బిగ్ బాస్ కి పంపించే ప్రయత్నంలో భాగంగా లక్షల అప్లికేషన్లు రాగా.. అందులో నలభై నాలుగు మంది సెలక్ట్ అయ్యారు. దాంతో వారికి అగ్నిపరీక్ష పెట్టి ఫిల్టర్ చేసిన విషయం తెలిసిందే.
ఆ పదిహేను మందిలో ఇద్దరు ఎలిమినేట్ కాగా పదమూడు మంది ఉన్నారు. వారికి టాస్క్ లు పెట్టి అందులో బెస్ట్ ఇచ్చిన వారికి స్టార్, బెస్ట్ ఇవ్వనివారికి వరెస్ట్ ఇచ్చారు. కొందరికి ఎల్లో కార్డ్, రెడ్ కార్డు కూడా ఇచ్చారు. ఇక నిన్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగింది. మహాపరీక్ష టాస్క్ లో భాగంగా మనీష్ గెలిచి స్టార్ సంపాదించుకున్నాడు. కానీ ఎవరు బిగ్ బాస్ సీజన్-9 హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనేది సస్పెన్స్ గానే ఉంచారు బిబి టీమ్. హౌస్ లోకి ఎవరు వెళ్లినా.. వెళ్లకపోయినా మూవ్ ఆన్ అవ్వాలి.. అందరు బెస్ట్ ఇచ్చారని కంటెస్టెంట్స్ ని జడ్జెస్ మోటివేట్ చేశారు.
అగ్నిపరీక్ష జర్నీ ముగియడంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. అభిజిత్, నవదీప్, బిందు మాధవి మేము అంతా కూడా కామనర్స్ నుండి ఈ స్టేజికి వచ్చాము.. మాకు ఇండస్ట్రీతో ఎలాంటి కనెక్షన్ లేదు.. మా ట్యాలెంట్ వల్లనో.. ఫ్యాషన్ వల్లనో ఈ స్టేజికి వచ్చాము.. మీరు కూడా ఇలా ముందుగా సాగాలని.. సెలబ్రిటీ అవ్వాలని ఆశిస్తున్నానని కంటెస్టెంట్స్ ని ఉత్తేజపరుస్తుంది శ్రీముఖి. కామనర్స్ గా బిగ్ బాస్ సీజన్-9 లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |